జనన ధృవీకరణ పత్రమును
జనన ధృవీకరణ పత్రమును పొందుటకు రెండు విధానములు కలవు
- పౌర సాంఘిక భాద్యత.
- ఆలస్య జనన ధృవీకరణము.
- పౌర సాంఘిక భాద్యత:
ఈ విధానము నందు పౌరులు వారి వారి మునిసిపాలిటి/పంచాయితీ లలో వైద్యని ధృవీకరణ పత్రము సహాయముతో పొందవచ్చును. ఈ సదుపాయము బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు మాత్రమే
S.L.A పీరియడ్ 21 రోజులు. సేవరుసుము ౩౦/- అంతర్జాల చిరునామా http://www.ubd.ap.gov.in:8080/UDBMIS/
- ఆలస్య జనన ధృవీకరణము:
ఈవిధానము నందు పౌరులు దగ్గరలో ఉన్న ‘మీసేవ’ నందు జనన ధృవీకరణ ఒక సంవత్సరం తరువాత నైనా నమోదు చేయించుకోవచ్చును. ఏ ప్రభుత్వ అధికారిని ప్రత్యక్షముగా కలవనవసరం లేదు. దానికి ఈ క్రింది పత్రములు అవసరము.
- భౌతిక పత్రము.
- పంచాయితీ లేదా మునిసిపాలిటి జారీ చేసిన నిర్లభ్యతా పత్రము.
- రేషను కార్డ్ కాపీ.
- పదవ తరగతి (SSC) మర్కుల ధృవపత్రము.
- స్వయం ధృవీకరణ పత్రము.
సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగిరి ‘బి’ నందు, పొందిన తరువాత కేటగిరి ‘ఎ’ గాను పరిగనించబడును.
పై విధముగా పౌరుడు తనకు అవసరమైన ధృవపత్రమును పొందవచ్చును.
మీ సేవా పోర్టల్ Url: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
LRBD ధృవపత్రము రెవిన్యూ విభాగము నుండి పొందిన తరువాత మునిసిపాలిటికి గాని పంచాయితీకి గాని పౌరుడు వెళ్ళి జనన ధృవీకరణ పత్రమును పొందవచ్చును.
పర్యటన: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx
సంప్రదించండి: సమీప సచివాలయం
ప్రాంతము : సచివాలయం | నగరం : Nandyal | పిన్ కోడ్ : 518501